అమెరికా పై మండిపడ్డ ఇరాన్‌, రష్యా

Russia, Iran
Russia, Iran

వియన్నా: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) ప్రత్యేక సమావేశంబుధవారం జరిగింది. ఈ సమావేశంలో అమెరికా ప్రతినిధి జాకీ వాల్కాట్‌ మాట్లాడుతూ ఇరాన్‌ ఇప్పుడు ‘అణు దోపిడీ’ని కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈ ఒప్పందంలో ఇతర భాగస్వామ్య దేశాలయిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాలు నిర్లిప్తంగా ఉన్నంత వరకూ తాము ఈ ఒప్పందంలోని పరిమితులను పట్టించుకోబోమని ఇరాన్‌ తేల్చిచెప్పింది. ఇరాన్‌ ప్రతినిధి కాజెమ్‌ గరీబ్‌ అబదీ మాట్లాడుతూ అమెరికా వినతి మేరకు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయటం విచారకరమని అన్నారు. అమెరికా కట్టుతప్పి వ్యవహరించటం వల్లే ప్రస్తుత ప్రతిష్టంభన ఏర్పడిందని ఆయన చెప్పారు. ఇరాన్‌పై ఆంక్షలు విధించిన అమెరికా ‘శాడిజా’న్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాస్తవానికి ఇరాన్‌ విషయంలో అమెరికా ఏకాకిగా మారిందని రష్యా రాయబారి మిఖాయిల్‌ ఉల్యనోవ్‌ సమావేశం అనంతరం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. 2015 నాటి అణు ఒప్పందానికి కట్టుబడి వుండాలంటూ ఇరాన్‌పై వత్తిడి తెచ్చేందుకు అమెరికా కొనసాగిస్తున్న చర్యలపై ఇటు ఇరాన్‌తో పాటు అటు రష్యా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.


తాజా బిజెనెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/