ఐఫోన్‌ డిజైన్‌ పై ట్రంప్‌ సలహా

tim cook and trump
tim cook and trump

వాషింగ్టన్‌: గత రెండు సంవత్సరాల క్రితం ఐఫోన్‌ డిజైన్‌లో మార్పుచేసి కొన్ని ఐఫోన్‌ మోడళ్లలో హోం బటన్‌ను తీసివేసింది. ఈ కారణంగా యూజర్‌ ప్రతిసారి హోం స్రీన్‌కు రావలంటే స్క్రీన్‌ను స్వైప్‌ చేయాల్సి వస్తోంది. దీనివల్ల సాధారణ యూజర్లే కాదు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇబ్బంది పడుతున్నట్లున్నారు. అందుకే యాఫిల్‌ సిఈఒ టీమ్‌కుక్‌కు ట్రంప్‌ ఐఫోన్‌ డిజైన్‌ పై చిన్న సలహా ఇచ్చారు. ట్రంప్‌ ప్రభుత్వం ఇచ్చిన ఐఫోన్‌ వాడుతున్నట్లు దాని డిజైన్‌పై ఒ ట్వీట్‌లో ఐఫోన్‌ స్వైప్‌కంటే బటనే బాగుందన్నారు. దీనికి కుక్‌నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఐఫోన్‌ టెన్‌లో ఈ మార్పులను 2017లో చేసింది. అప్పటినుండి విడుదలైనా ప్రతి ఐఫోన్ల్‌లో హోం బటన్‌ను తోలిగించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh