మా దేశంలో పెట్టుబడి పెట్టండి..

ఇండియా, జాపాన్, సింగపూర్, ఆస్ట్రేలియాలతో పాటు ఇతర దేశాలను కోరుతున్నా

Sri Lanka President Rajapaksa
Sri Lanka President Rajapaksa

శ్రీలంక: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష అన్నారు. ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఇండియా, జాపాన్, సింగపూర్, ఆస్ట్రేలియాలతో పాటు ఇతర దేశాలను కోరుతున్నానని అన్నారు. శ్రీలంకలో పెట్టుబడులు పెట్టాలని వారి దేశాలకు చెందిన కంపెనీలకు చెప్పాలని సూచించారు. అప్పుడే తమ దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇది ఒక శ్రీలంక సమస్య మాత్రమే కాదని ఆసియాలోనే అనేక దేశాల సమస్య అని చెప్పారు. ఈ దేశాలు పెట్టుబడులు పెట్టకపోతే ఆ పని చైనా చేస్తుందని తెలిపారు. తద్వారా చైనా తన బెల్డ్ అండ్ రోడ్ కార్యక్రమాన్ని అన్ని దేశాలకు విస్తరింపజేస్తుందని చెప్పారు.

కొలంబోలోని హంబన్ టోట పోర్టుకు సంబంధించి చైనాతో ఉన్న ఒప్పందాన్ని తాము సమీక్షిస్తామని రాజపక్స తెలిపారు. హంబన్ టోట వంటి వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులపై శ్రీలంక నియంత్రణే ఉండాలని తాను భావిస్తున్నానని చెప్పారు. ఇలాంటి అత్యంత కీలకమైన ప్రాజెక్టులు ఇతరుల నియంత్రణలో ఉంటే రాబోయే తరాలకు అన్యాయం చేసినవారమవుతామని తెలిపారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/