ఇన్ఫోసిస్‌కు మరో భారీ జరిమానా

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికాలోని కాలిఫోర్నియా ప్రభుత్వానికి భారీ జరిమానా చెల్లించనుంది.

infosys
infosys

వాషింగ్టన్‌: ఇన్ఫోసిస్‌ అమెరికాలోని కాలిఫోర్నియా ప్రభుత్వానికి భారీ జరిమానా చెల్లించనుంది. వీసా నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు దానికి సంబంధించిన పన్ను అవకతవకలకు పాల్పడినందుకు 8లక్షల డాలర్లు(రూ.565కోట్లు) జరిమానా విధించినట్టు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ తెలిపారు. 2006-2017వరకు దాదాపు 500 మంది ఉద్యోగులను ఇన్ఫోసిస్ హెచ్1బి వీసాకు బదులు తీ1 వీసాపై కాలిఫోర్నియాకు పంపించింది. తద్వారా అక్కడి వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టయింది. హెచ్1బి వీసాలపై పరిమితి ఉండటం, ఆ వీసాపై వచ్చే ఉద్యోగులకు అక్కడి ప్రమాణాల ప్రకారం వేతనం చెల్లించాల్సి ఉండటంతో ఇన్ఫోసిస్ తీ1 వీసాపై ఉద్యోగులను అక్కడికి తరలించిందన్న ఆరోపణలున్నాయి. గతంలో సంస్థలో పనిచేసిన ఓ ఉద్యోగి దీనిపై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపించారు. ఇన్ఫోసిస్ అవకతకవలు బయటపడటంతో ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లించేందుకు సంస్థ ఒప్పుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/