కెనడా వైపు చూస్తున్న భారతీయ నిపుణులు!

రెండువారాల్లోనే ఖరారవుతున్న వీసా

Visa
Visa

న్యూఢిల్లీ: వీసా జారీలో అమెరికా నుంచి ఎదురవుతున్న ఇబ్బందులతో భారతీయులతోపాటు మరికొన్ని దేశాల మేధావులు, ఉన్నత చదువులు చదివినవారు ఈసారి కెనడావైపు ఎక్కువ దృష్టిపెడుతున్నారు. ఇపుడు కెనడాకు ఎక్కువ మంది వీసాలు పొందుతున్నారు. శాశ్వత నివాసం కోసం దరఖాస్తుచేసి వేగంగా పొందిన వారంసిఖ్య కెనడాలో 51శాతానికిపెరిగింది. 39,500 మందివరకూ భారతీయ పౌరులకు కెనడాలో శాశ్వత నివాస ధృవపత్రాలు లభించాయి. ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ వ్యవస్థద్వారా శరవేగంగా వీరికి పర్మనెంట్‌ వీసా లభించింది. 2017తో పోలిస్తే 2018చివరినాటికి ఈసంఖ్య సుమారుగా రెట్టింపు అయందని అంచనా. అమెరికా తిరస్కారం పొందుతున్నవారిని ఎక్కువగా కెనడా ఆహ్వానిస్తోంది. మేధావులు, ప్రతిభావంతులద్వారా మరింత వృద్ధిని సాధించే అవకాశం ఉంటుందన్న భావనతో కెనడా ఎక్కువ మంది భారతీయులను కోరుతున్నది. ఇప్పటికే సిక్కుజనాభాపరంగా కెనడాలో ఎక్కువ మంది నివసిస్తున్న సంగతి తెలిసిందే. కెనడా గత ఏడాది 92 వేల మందికి కొత్త శాశ్వత ఎంట్రీ రెసిడెంట్స్‌గా అనుమతులు జారీచేసింది.

సుమారుగా 65,500మందికి శాశ్వత నివాస ధృవపత్రాలిస్తే 40శాతం మంది 26,300మందికిపైగా వీరిలో భారీయులే ఉన్నారు. ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ వ్యవస్థ ఎక్కువగా వృత్తినైపుణ్యం, అర్హతలు ఎక్కువ ఉన్న కార్మికులను శాశ్వత నివాసం కింద వారికి మంజూరుచేస్తుంది.మూడు ఆర్ధిక వలస విధానాలద్వారా వీరికి పిఆర్‌సి లభిస్తుంది. కెనడాలో ఇపుడు ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ సిస్టమ్‌ ద్వారా శరవేగంగా అనమతులు మంజూరవుతున్నాయి. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు పూర్తిచేసి ఇవ్వాల్సి ఉంటుంది. వారికి ర్యాంకులు కటాయిస్తారు. ఆ తర్వాత సమగ్ర ర్యాంకింగ్‌ వ్యవస్థద్వారా వీరి దరఖాస్తులను, కటాఫ్‌ సంఖ్యకు ముందుగా వచ్చిన దరఖాస్తులను శాశ్వత నివాసం కోసం పరిశీలనచేస్తారు. భారతీయ వృత్తినిపుణులకు కెనడా ఇపుడు అత్యంత వర్ధమాన దేశంగా నిలిచింది. ఐటి రంగానికిసైతం ఎక్కువ మంది ఉన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/