అమెరికాలో భారతీయ విద్యార్థికి ఏడాది జైలు

Vishwanath Akuthota
Vishwanath Akuthota

న్యూయార్క్: అమెరికాలో ఇండియన్ విద్యార్థి కంప్యూటర్లను షార్ట్ సర్క్యూట్ తో ధ్వంసం చేసినందుకు అక్కడి కోర్టు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. విశ్వనాథ్ అకుతోటా అనే విద్యార్థి అల్బానీలో సెయింట్ రోస్ కాలేజీలో ఎంఎస్ చేస్తున్నాడు. విశ్వనాథ్ యుఎస్బీతో కంప్యూటర్ కు ఛార్జింగ్ చేస్తున్నాడు. విరామం లేకుండా ఛార్జింగ్ పెడుతుండడంతో 66 కంప్యూటర్లలో ఉన్న (యుఎస్బీ కిల్లర్ ) యుఎస్బీ పోర్ట్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ధ్వంసమయ్యాయి. దీంతో కాలేజీ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ విద్యార్థిని కస్టడీలోకి తీసుకున్నారు. స్థానిక కోర్టు ఆ విద్యార్థికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 58,471 డాలర్లు (41,56,118 రూపాయలు) జరిమానా విధించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/