మోదీ ప్రకటనను స్వాగతించిన అమెరికా

Indian Prime MinisterNarendra Modi
Indian Prime MinisterNarendra Modi

Washington: వివక్షకు తావు లేకుండా దేశంలో ప్రజలందరికీ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పిస్తామని ప్రధాని మోదీ ఎన్నికల ఫలితాల అనంతరం చేసిన ప్రకటనను అమెరికా స్వాగతించింది. చరిత్రాత్మక విజయం సాధించిన మోదీ ప్రభుత్వం ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొనేలా పరిపాలన కొనసాగించాలని ఆకాంక్షించింది. ప్రధానిగా మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అమెరికా విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సరికొత్త భారతాన్ని ఆవిష్కరించడానికి నవ శక్తితో మా కొత్త ప్రయాణం మొదలు పెడతామని ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.