ట్రంప్‌ మాజీ పార్టనర్‌ అరెస్ట్‌!

Dinesh Chawla
Dinesh Chawla

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాజీ వ్యాపార భాగస్వామి, భారత సంతతికి చెందిన హోటళ్ల యజమాని దినేష్‌ చావ్లా దొంగతనం కేసులో పట్టుబడ్డారు. అమెరికాలోని మంఫిస్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల లగేజీలను దొంగిలించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చావ్లా హోటల్స్‌కు సీఈవో అయిన చావ్లా.. గత వారాంతంలో మంఫిస్ అంతర్జాతీయ విమనాశ్రయం బ్యాగేజి నుంచి లగేజి తీసుకెళ్తూ సీసీ కెమేరాలకు చిక్కారు. సూట్‌కేస్‌లను దొంగిలించి తన కారులో పెట్టిన ఆయన… విమానం ఎక్కేందుకు తిరిగి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లారని పోలీసులు వెల్లడించారు. ఆయన కారును తనిఖీ చేసి అందులో ఓ సూట్‌కేస్‌తో పాటు ఇతర లగేజి ఉన్నట్టు గుర్తించామనీ.. నెలరోజుల క్రితం ఆయన వీటిని ఎత్తుకెళ్లినట్టు తేలిందని పేర్కొన్నారు. చావ్లా మంఫిస్‌కు తిరిగి రాగానే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.


తాజా క్రీడా వార్తల క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/