అత్యాచారం కేసులో ఇండియన్‌కి ఏడేళ్ల జైలు

ajay rana
ajay rana

లండన్‌: ఓ యువతిపై అత్యాచారం చేసి తప్పించుకునేందుకు లండన్‌ నుంచి పారిపోయి భారత్‌కు వచ్చిన ప్రబుధ్దుడు పట్టుబడడంతో దోషిగా తేలిన ఇతడికి న్యాయస్థానం ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. లండన్‌లో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. అజ§్‌ు రానా(35) అనే యువకుడు తూర్పు లండన్‌ సఫోల్క్‌ ప్రాంతంలో డిసెంబరు 9, 2017న స్పేహితుడు కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తూ ఒదక మహిళకు లిఫ్ట్‌ ఇచ్చాడు. కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత కారు పక్కకు ఆపి మహిళను కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకుని తన స్నేహితులకు జరిగిన విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు.
కారు ప్రయాణించిన మార్గంలోని సిసి టివి ఫేటేజిని పరిశీలించిన పోలీసులు కారు యజమానిని గుర్తించారు. ఆయనను ఎంక్వైరి చేయగా నిందితుడు అతని రూమ్‌మేట్‌ అని ఇండియాకు మూడు రోజుల క్రితం వెళ్లాడని చెప్పాడు. అతను వాడే ఇయర్‌ఫోన్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాపారు. బాధితురాలి వైద్య రిపోర్టులు…నిందితుని డిఎన్‌ఏ రిపోర్టులు సరిపోలాయి. యూకే పోలీసులు అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. యూరోపియన్‌ అరెస్టు వారెంట్‌పై నిర్భంధంలోకి తీసుకుని నవంబరులో యూకెకు తరలించారు. విచారణలో అజ§్‌ురానా దోషిగా తేలడంతో కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/