పాక్‌లో భారత్‌ కరెన్సీ ముద్రణ!

indian currency
indian currency

న్యూఢిల్లీ: భారత్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లో లష్కరేతోయిబా, జైషేమహ్మద్‌ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులు ఉంటున్నారని వారికి చేరేలా నెట్‌వర్క్‌ను రూపొందించుకున్నారని, వారి ద్వారా నకిలీ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చేలా కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. మనదేశానికి చెందిన రూ.2000, రూ.500, రూ.200 రూపాయల నోట్ల కట్టలు వెలుగు చూశాయన్నారు. ఆ నోట్లన్నీ నకిలీవని, వాటిని పాకిస్థాన్‌లో ముద్రించి, బంగ్లాదేశ్‌ గుండా భారత్‌లోని ప్రధాన నగరాలకు చేరవేస్తున్నట్లు చెప్పారు. భారత ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా పాకిస్థాన్‌ కుట్ర చేస్తున్నదని, ఇష్టానుసారంగా మనదేశ కరెన్సీ నోట్లను ముద్రిస్తోందన్నారు. భారత్‌లో ఉన్నట్లుగా అనుమానిస్తున్న ఉగ్రవాదులకు ఆ నకిలీ నోట్లను చేరవేస్తోందని, భారత్‌లో నివాసముంటున్నట్లుగా అనుమానిస్తున్న ఉగ్రవాదులకు నకిలీ నోట్లను చేరవేస్తోందని, ఉగ్రవాదుల ద్వారా వాటిని చలామనిలోకి తీసుకవస్తున్నదని కేంద్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు ధృవీకరించారు. పాకిస్థాన్‌లో ముద్రించిన నకిలీ నోట్లను నేపాల్‌, బంగ్లాదేశ్‌ మీదుగా మనదేశంలోకి పంపిస్తున్నారన్నారు. పాకిస్థాన్‌ జాతీయుడు యూనుస్‌ అన్సారి అనే వ్యక్తిని నేపాల్‌ పోలీసులు ఖాట్మండులోలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ సందర్బంగా అతని వద్ద నుండి 70 లక్షల రూపాయలకుపైగా భారత్‌ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వారం కిందట ఢాకాలోని హజ్రత్‌ షా జలాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 లక్షల రూపాయల నకిలీ నోట్లను పట్టుకున్నారు. భారత్‌లో నివసిస్తున్న సల్మాన్‌ షేరా అనే వ్యక్తికి పంపించిన పార్సిల్‌లో కూడా నకిలీ నోట్లు కనిపించాయన్నారు. బంగ్లాదేశ్‌ అధికారులు ఈ సమాచారాన్ని కేంద్రప్రభుత్వానికి అందించారని, దీనిపై అప్రమమ్మత్తమైన ఇంటలిజెన్స్‌ అధికారులు మొత్తం కూలీ లాగారు. నకిలీ నోట్లు పెద్ద ఎత్తున చలామణిలోకి తీసుకుని ఆరవడానికి పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోన్న విషయం వాస్తవేనని నిర్ధారించారు. ఖాట్మండు విమానాశ్రయంలో లించిన 70లక్షల రూపాయలు, ఢాకాలో పార్సిల్‌లొ దిరొకిన కరెన్సీ నకిలీదని తేల్చారు. ఈ నకిలీ నోట్లన్నింటినీ లష్కరే తొయిబా, జైషె మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులకు అందేలా ప్లాన్‌ చేసి ఉంటారన్ని అనుమానిస్తున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/