పాక్‌లో భారతి సంతతి వ్యాపారవేత్త ఔదార్యాం

water hand pumps in Pakistan
water hand pumps in Pakistan


దుబాయ్ : ఈశాన్య పాకిస్థాన్‌లో పేదరికం పట్టి పీడిస్తున్న సింధ్‌ ప్రావిన్స్‌లో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త జోగిందర్‌సింగ్‌ సలేరియా అక్కడి ప్రజల దాహం తీర్చేందుకు 62 చేతి పంపులను ఏర్పాటు చేశారు. సామాజికి కార్యకర్తల సాయంతో ఆ ప్రాంతంలోని ప్రజలకు ఆహారధాన్యాలు కూడా పంపిణీ చేశారు. అయితే జోగిందర్ సింగ్ సలేరియాయూట్యూట్, ఫేస్‌బుక్‌లలో కొంతమంది సామాజిక కార్యకర్తల ద్వారా సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నారు. పాకిస్థాన్‌లో పేదరికం అధికంగా గ్రామాల్లో చేతిపంపులు ఏర్పాటు చేశామని దుబాయ్ మీడియా ఖలీజ్ టైమ్స్‌కు జోగిందర్ సింగ్ చెప్పారు. పేద ప్రజల కోసం పెహల్ చారిటబుల్ ట్రస్ట్ కూడా నడిపిస్తున్నారు జోగిందర్ సింగ్ సలేరియా.జోగిందర్ సింగ్ సలేరియా యూఏఈలో 1993 నుంచి ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/