భారతీయుడి సహా ఆరుగురు మృతి

ఈజిప్టు ఘోర రోడ్డుప్రమాదం

Egypt road accident
Egypt road accident

కైరో(ఈజిప్టు): ఈజిప్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక భారతీయుడు తోపాటు మరో ఆరుగురు మృతి చెందారు. సోఖ్నా-ఝఫరానా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. కాగా పర్యాటకులకు చెందిన రెండు బస్సులు వెళ్తుండగా మొదటి బసుసను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ క్రమంలో వెనక వస్తున్న బస్సు ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా అందులో ఒకరు భారత్‌కు చెందిన వారిగా గుర్తించారు. మిగతా ఐదుగురిలో ఇద్దరు మలేషియా, ముగ్గురు ఈజిప్టు వాసులగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరో 20 మందికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను కైరోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ప్రమాద ఘటనపై ఇప్పటి వరకు కైరోలోని రాయబార కార్యాలయం ధువీకరించలేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/