2021 నాటికి చైనాను వెనక్కి నెట్టేయనున్న భారత్!

world bank
world bank

హైదరాబాద్‌: ఈ సంవత్సరం భారత ఆర్థికవృద్ధి రేటు 7.5 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అయితే రాబోయే రెండేళ్లు అంటే 2019-20, 2020-21లో కూడా ఇదే వృద్ధిరేటు నమోదు అవుతుందని వెల్లడించింది. అదే సమయంలో చైనా వృద్ధిరేటు 2018లో 6.6 శాతంగా నమోదు కాగా, ఈ ఏడాది అది 6.2 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. ఇది 2020లో 6.1 శాతానికి పరిమితమవుతుందని హెచ్చరించింది. అదే సమయంలో 2021 నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థగా మారుతుందని చెప్పింది. 2021 నాటికి భారత వృద్ధిరేటు చైనా కంటే 1.5 శాతం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/