భారత్‌తో సత్సంబంధాలు కొనసాగుతాయి

America and India
America and India

వాషింగ్టన్‌: ప్రధానమంత్రి నరేంద్రమోడి హయాంలో భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు బలపడాయని శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయిఏ లోక్‌సభ ఎన్నికల తరువాత ఈ సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతసంవత్సరం భారత్‌-అమెరికా మధ్య జరిగిన ‘టూ ప్లస్‌ టూ’ చర్చలు సత్సంబంధాలు మరింత ముందుకెళ్లేలా దోహదపడ్డాయని స్పష్టం చేశారు. 2017లో మోదీ అమెరికా పర్యటన కూడా సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించిందన్నారు. ఇటీవల విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి విజయ్‌ గోఖలే జరిపిన పర్యటన వాటికి కొనసాగింపేనని ఆయన అభిప్రాయపడ్డారు. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో నుంచి అమెరికా భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ వరకూ ప్రతి ఒక్కరితో గోఖలే కీలక చర్చలు జరిపారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఎవరు గెలుపొందినా.. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. వ్యూహాత్మకంగా భారత్‌తో బంధం అమెరికాకు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక కదలికలకు భారత్‌ నుంచి తోడ్పాటు లభించడం వైపు దృష్టి సారించామని తెలిపారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/