చైనాకు వైద్య సాయం అందించనున్న భారత్‌

వైద్యసామగ్రితో ఓ విమానాన్ని వుహాన్‌కు పంపనుంది

india-to-send-consignment-of-medical-supplies-to-china
india-to-send-consignment-of-medical-supplies-to-china

బీజింగ్‌: కొవిడ్‌-19 నానాటికీ తీవ్ర రూపం దాలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా చైనాలో మృతుల సంఖ్య 1700 దాటింది. కాగా కొవిడ్‌ 19తో అల్లాడిపోతున్న చైనాకు అండగా ఉండేందుకు భారత్‌ ముందుకొచ్చింది. ఆ దేశానికి వైద్య సహాయం అందిస్తామని ప్రకటించింది. త్వరలోనే వైద్య సామగ్రితో ఓ సహాయక విమానాన్ని వుహాన్‌ నగరానికి పంపించనున్నట్లు ఎంబసీ వెల్లడించింది. ఇందుకోసం ఈ వారాంతంలో వైద్య సామగ్రితో ఓ సహాయక విమానాన్ని వుహాన్‌కు పంపించనుంది. తిరుగు ప్రయాణంలో పరిమిత సంఖ్యలో భారతీయులను స్వదేశానికి తీసుకెళ్లే వీలుంది. అని భారత ఎంబసీ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. వుహాన్‌, హుబె§్‌ు ప్రాంతాల్లో ఉన్న భారతీయులు ఈ విమానంలో స్వదేశానికి రావాలనుకుంటే సోమవారం రాత్రి 7 గంటల్లోగా రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. కొవిడ్‌ 19 వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో చైనాలో మాస్క్‌లు, గ్లౌజులు వంటి వైద్య పరికరాల కొరత ఏర్పడింది. దీంతో వైద్య పరంగా చైనాకు సాయం చేసేందుకు భారత్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/