అది పూర్తిగా భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశం

Emmanuel Macron- Narendra Modi
Emmanuel Macron- Narendra Modi

పారిస్‌: భారత ప్రధాని నరేంద్రమోడి మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ భేటి అయ్యారు. ఇరువురు గురువారం దాదాపు 90 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ అంశంతో పాటు ద్వైపాక్షిక, రక్షణ, ఉగ్రవాద నిర్మూలన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మెక్రాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఖఖప్రధాని(మోదీ) కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి పూర్తిగా వివరించారు. అయితే కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌పాక్‌ల అంతర్గత అంశమని.. ఎలాంటి ఆందోళన పరిస్థితులకు తావివ్వకుండా చర్చించుకోవాలని, మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని స్పష్టం చేశానుగగ అని తన వైఖరిని తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన చర్యలపైనా ఇరుదేశాధినేతలు చర్చించారు. శాంతి స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలో కీలక పారిస్‌ ఒప్పందంలో భారత్‌ పాత్ర ఎనలేదని కొనియాడారు. అదే తరహాలో అంతర్జాతీయ అంశాల్లో భారత్‌ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్‌ అభిప్రాయపడింది. అంతకు ముందు మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య పలు అంశాల్లో బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు సాగుతాయని స్పష్టం చేశారు. ఉభయ దేశాల ప్రజల సుభిక్షమే లక్ష్యంగా మైత్రి కొనసాగుతుందన్నారు.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/