ట్రంప భారత పర్యటన …అమెరికా కీలక ప్రకటన

INDIA, AMERICA
INDIA, AMERICA

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈనెల 24, 25న భారత్‌ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే నేపథ్యంలో ట్రంప్‌ భారత పర్యటనకు ముందు అగ్రరాజ్యం కీలకమైన ప్రకటన చేసింది. భారత్‌ అభివృద్ది చెందిన దేశం. జీఎస్‌పీ (జనరలైజూడ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌) పథకం ప్రయోజనాలను పొందేందుకు భారత్‌కు అర్హతలేదు. జీఎస్‌పీ పథకం వర్ధమాన దేశాలకు ఉద్దేశించినదని యూనైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యూఎస్‌టీఆర్‌) కార్యాలయం ప్రకటించింది. దీంతో జీఎన్‌పీ పథకం హోదాను తిరిగిపొందాలనే భారత్‌ ఆశపై నీళ్లు చల్లినట్టయింది. ప్రపంచబ్యాంక్‌ పేర్కొన్నట్టుగా భారత్‌తో పాటు జీ20 బ్లాక్‌లోని దేశాలైన అర్జెంటీనా, బ్రెజిల్‌, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా దేశా తలసరి జీఎన్‌ఐ 12,375 డార్ల కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించవచ్చని యూఎస్‌టీఆర్‌ వాదిస్తోంది. 0.5 శాతం కంటే తక్కువగానే ఉండాలి. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ పరిమితిని భారత్‌ అధిగమించింది. 2017 నాటి గణాంకాల ప్రకారం.. ప్రపంచ వాణిజ్యంలో భారత భాగస్వామ్యం ఎగుమతుల్లో 2.1, దిగుమతుల్లో 2.6 శాతంగా ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/