నూరుశాతం సమితికి భారత్‌ చెల్లింపులు

UNO office
UNO office

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వంలో ఉన్న దేశాలు చెల్లింపులో మాత్రం వెనుకబడి ఉన్నాయి. అయితే వంద శాతం చెల్లింపుల విషయంలో ప్రపంచంలోనే అగ్రదేశం అమెరికా కంటే భారత్‌ ముందుండడం విశేషం. అధికారంలో అగ్రస్థానంలో ఉన్నా చెల్లింపుల్లో మాత్రం వెనుకడి ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి వీటో అధికారం ఉన్న సభ్య దేశాలు. నిధుల్లేక ఐక్యరాజ్యసమితి అల్లాడిపోతున్నది. ఖజానా ఖాళీ అయిందని, రిజర్వ్‌ నిధులు నెలాఖరుకు అయిపోయే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 230 మిలియన్‌ డాలర్ల లోటుతో సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ నేపథ్యంలో సభ్య దేశాలు తమ వాటా నిధులు చెల్లించాలని విజప్తులు చేస్తున్నప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలు మొత్తం 193 ఉండగా వాటిలో ఇప్పటి వరకు వాటా నిధులు పూర్తిగా చెల్లించిన దేశాలు కేవలం 35 మాత్రమే. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అయితే బకాయిలు ఉన్న జాబితా వెల్లడించలేదు. బకాయిలు పూర్తిగా చెల్లించిన దేశాల్లో వీటో అధికారం ఉన్న దేశం ఒక్కటీ లేదు. బకాయిలు ఉన్న దేశాల్లో అమెరికా, బ్రిజిల్‌, అర్జెంటీనా, మెక్సికో, ఇరాన్‌ తదితర దేశాలు ఉన్నాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/