భారత్‌ ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయింది

ఆమెతో పరిచయం ఉండటం గౌరవంగా భావిస్తున్నా

Ivanka Trump- Sushma Swaraj
Ivanka Trump- Sushma Swaraj

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు, ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్ కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుష్మాస్వరాజ్‌ అకాల మరణంతో అంకితభావం గల నాయకురాలిని, ప్రజాసేవకురాలిని భారత్‌ కోల్పోయింది. భారత్‌, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆమె ఓ ఛాంపియన్‌. ఆమెతో పరిచయం ఉండటం గౌరవంగా భావిస్తున్నా, సుష్మాజీ ఓ ఛాంపియన్‌ అని కొనియాడారు. భారత్‌ ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని ఇవాంక ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా భారత పర్యటన సమయంలో సుష్మాస్వరాజ్‌తో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.


సుష్మాజీ ఓ ఛాంపియన్‌
తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/