పాక్‌ ఖైదీలను విడుదల చేసిన భారత్‌

pak prisoners
pak prisoners

న్యూఢిల్లీ: భారత జైళ్లలో మగ్గుతున్న ఆరుగురు పాకిస్థాన్‌ ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఒక మైనర్‌ బాలుడు ఉన్నాడు. దారి తప్పి పాక్‌ సరిహద్దు దాటి భారత్‌ భూభాగంలోకి అడుగుపెట్టేందుకు వీరిని జైళ్లలో వేశారు. కాగా శుక్రవారం పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద వీరిని పాక్‌లో వదిలిపెట్టారు. ఈ ఆరుగురిలో ఐదుగురు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా కరాచీ ప్రాంతీయులని సమా అనే పాక్‌ మీడియా పేర్కొంది. ఏప్రిల్‌లో భారీ సంఖ్యలో భారత ఖైదీలను పాక్‌ విడుదల చేసింది. ఆ నేపథ్యంలోనే పాక్‌ ఖైదీలను విడుదల చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/