నియంత్రణ రేఖ వద్ద ఇమ్రాన్‌ఖాన్‌ పర్యటన

Imran Khan
Imran Khan


ఇస్లామాబాద్‌: ఆర్టికల్‌ 370 రద్దు తరువాత భారత్‌ – పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇమ్రాన్‌ఖాన్‌ ఏదో సందర్భంలో భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నియంత్రణ రేఖ వద్ద పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆర్మీ చీఫ్‌జావెద్‌ బజ్వా, రక్షణ మంత్రి పర్వేజ్‌ ఖట్టక్‌, విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి, కాశ్మీర్‌ ప్రత్యేక కమిటీ చైర్మన్‌ సయ్యద్‌ ఫకర్‌ ఇమామ్‌ ఉన్నారు. పాకిస్థాన్‌ రక్షణ, అమరవీరులు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్వోసి వద్ద వీరు పర్యటించారు. సరిహద్దుల వద్ద భారత్‌ నుంచి ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పాక్‌ సైనికబలగాలు సిద్ధంగా ఉండాలని కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్‌ ఖాన్‌ పిలుపునిచ్చారు. ఆ సందర్భంలోనే నియంత్రణ రేఖ వద్ద పర్యటించాలని ఇమ్రాన్‌ ఖాన్‌ నిర్ణయించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/