పీవోకే భారత్‌దే.. పాక్‌ తీవ్ర స్పందన

imran khan
imran khan

 ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, ఏదో ఒకరోజున దానిని దేశ భౌగోళిక అధికార పరిధిలోకి తీసుకొచ్చేస్తామని భారత్‌ చేసిన వ్యాఖ్యలపై దాయాది తీవ్రంగా స్పందించింది. భారత్‌ దుందుడుకుగా చేస్తున్న వ్యాఖ్యలను అంతర్జాతీయ సమాజం సీరియస్‌గా పరిగణించాలని కోరింది. బాధ్యతారాహిత్యంగా, అసంబద్ధంగా భారత్‌ ప్రకటనలు చేస్తోందని, దీనితో దాయాదుల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయి.. ఉపఖండంలో శాంతిభద్రతలు ప్రమాదంలో పడే అవకాశముందని పాక్‌ చెప్పుకొచ్చింది.