పాక్‌ కార్యాలయాల్లో వీఐపీ బాత్‌రూమ్‌లు ఏర్పాటు

mran-Khan-VVIP-Bathrooms
mran-Khan-VVIP-Bathrooms

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వీఐపీ సంప్రదాయానికి స్వస్తీ పలుకతున్నట్లు ఇంతకముందే ప్రకటించారు. అయితే ఆయన త్వరలో అమెరికా వెళ్లనున్నారు. అక్కడికి వెళ్తాను.. కానీ విలాసవంతమైన హోటళ్లలో మాత్రం బస చేయనని చెప్పారు. ఖర్చు తగ్గించుకునేందుకు ఇదో మార్గమమని ఆయన తెలిపారు. వీఐపీ పద్దతిని పక్కన పెట్టడం వల్ల ప్రజల్లోనూ తమ ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందనేది ఆయన అభిప్రాయం. అయితే ఆదేశ పరిశ్రమలు, ఉత్పత్తి మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లో మాత్రం వీఐపీ బాత్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. అక్కడి బాత్‌రూమ్స్‌ వద్ద బయోమెట్రిక్‌ యంత్రాలను ఉంచారు. ఆ శాఖ అదనపు సెక్రటరీ, అంతకు పై స్థాయి అధికారుల కోసం ప్రత్యేకంగా వాటిని ఏర్పాటు చేశారు. పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులతో పాటు అంతే స్థాయి ఉన్న ఇతర మంత్రిత్వ శాఖ అధికారులు వాటిని ఉపయోగించుకోవచ్చు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/