భారత్‌–పాక్‌ ప్రధానులతో భేటీ అవుతా

tramp
tramp

వాషింగ్టన్‌: భారత్, పాకిస్తాన్‌ల ప్రధాన మంత్రులతో త్వరలోనే భేటీ అవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ప్రకటించారు. భారత్, పాకిస్తాన్‌ల  మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాను ఎంతో ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌ 22న హ్యూస్టన్‌లో 50 వేల మంది భారత సంతతికి చెందిన అమెరికన్లు హాజరయ్యే ‘çహౌడీ.. మోదీ’ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్‌ పాల్గొననున్నారు. అయితే పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ట్రంప్‌ ఎక్కడ.. ఎప్పుడు కలుస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సోమవారం వైట్‌హౌజ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ ఈ వివరాలు వెల్లడించారు. కాగా, ఈ నెలాఖరున జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో భేటీ కానున్నట్లు ట్రంప్‌ పర్యాటక షెడ్యూల్‌ ద్వారా తెలుస్తోంది. కశ్మీర్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండా ‘అక్కడ చాలా అభివృద్ధి జరుగుతోంది’అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.