భార్య కోసం కుర్చీలా మారిన భర్త

చైనాలో ఘటన

man-becomes-human-chair
man-becomes-human-chair

హెగాంగ్‌: చైనాలో ఓ వ్యక్తి తన భార్య కోసం కుర్చీలా మారిపోయాడు. అది కూడా ఓ ఆసుపత్రిలో. గర్భవతిగా ఉన్న భార్యను తీసుకుని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆ వ్యక్తికి అక్కడ తానే ఓ కుర్చీలా మారిపోవాల్సి వస్తుందని ఏమాత్రం ఊహించలేదు. డాక్టరు ఇంకా రాకపోవడంతో వేచిచూడాల్సిందిగా సిబ్బంది సూచించారు. కానీ గర్భంతో ఉన్న ఆ వ్యక్తి భార్య కూర్చునేందుకు ఒక్క కుర్చీ కూడా ఖాళీలేదు. అన్నింట్లో పేషెంట్లు కూర్చున్నారు. దాంతో తన భార్య కోసం ఆ భర్త కుర్చీ అవతారం ఎత్తాడు. ఫ్లోర్ పై భర్త బాగా వంగి కూర్చోగా, అతడి వీపుపై భార్య కూర్చుంది. ఇదంతా చూస్తున్న ఇతరుల్లో ఏ ఒక్కరూ స్పందించి ఆమెకు కుర్చీ ఇచ్చిన పాపానపోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన చైనా పోలీసులు ఆసుపత్రిలో కుర్చీల్లో కూర్చున్న ఇతరుల వైఖరిని తప్పుబట్టారు. ఈ ఘటన హెగాంగ్ లోని హైలాంగ్ జింగ్ ప్రావిన్స్ లో జరిగింది. కాగా అతడికి ‘హజ్బెండ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇవ్వాల్సిందే అని కామెంట్లు పెడుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/