తుపానుకు ఎమర్జెన్సీ ప్రకటించిన ఫ్లోరిడా

cycolne in usa
cycole in usa


వాషింగ్టన్‌: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఎమర్జెన్నీ ప్రకించింది. హరికేన్‌ డోరియన్‌ సమీపిస్తుండడంతో గురువారం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. తుపానును ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్కరికీ కనీసం వారం రోజులకు సరిపడా గ్రాసం ఉండేలా చూసుకోవాలని పౌరులకు సూచించింది. ఆహారం, నీళ్లు, మందులు తదితర వాటిని వారానికి సరిపడా దగ్గర పెట్టుకోవాలని ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌ తెలిపారు. డోరియన్‌ హరికేన్‌ గత రెండురోజుల క్రితం అమెరికాలోని వర్జిన్‌ దీవులను తాకింది. దీనిని ఒకటో కేటరిరీగా పరిగణిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ తుపానును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/