డొరియన్‌ హరికేన్‌ విజృంభన..30 మంది మృతి

hurricane-dorian
hurricane-dorian

ఫ్లోరిడా: అమెరికాలో కరోలినా ప్రాంతంలో డొరియన్ హరికేన్ విజృంభిస్తోంది. వర్జినీయా, బహమాస్ ప్రాంతంలో 185 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హరికేన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటి వరకు 30 మంది మృతి చెందినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య వందలలో ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. డొరియాన్ హరికేన్ కరోలినా ప్రాంతం నుంచి పెనిన్‌సులా, జియోర్జియో, ఫ్లోరిడా వరకు విస్తరించి ఉంది. హరికేన్ ప్రమాదం పొంచి ఉండడంతో ముందస్తుగా ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అబకాస్, బహమాస్ ప్రాంతాలలో ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యామని రెడ్ క్రాస్ సోసైటీ వెల్లడించింది. బహమాస్‌లో బలమైన గాలులతో పాటు 85 సెంటీ మీటర్ల వర్షం కురవడంతో ఆ ప్రాంతం జలాశయంలాగా మారింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/