అమెరికా చీఫ్‌ ఆఫ్‌స్టాఫ్‌కు సమన్లు

Mulvaney
Mulvaney

వాషింగ్టన్‌: అభిశంసన దర్యాప్తులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తలిగింది. అభిశంసన దర్యాప్తు కమిటీ అధ్యక్షుడి యాక్టింగ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మిక్‌ ముల్వానికి సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ను ఇబ్బంది పెట్టేందుకు.. ఉక్రెయిన్‌పై ట్రంప్‌ ఒత్తిడి తీసుకువచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో ముల్వానికి పూర్తి అవగాహన ఉందని అభిప్రాయపడింది. అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన వ్యక్తిగత ఏజెంట్‌ రూడాల్ఫ్‌ గియులియా ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చిన విషయంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు దర్యాప్తులో తేలింది. అధ్యక్షుడిగా రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే విధంగా ఉక్రెయిన్‌కు 400 మిలియన్‌ డాలర్ల భద్రతా సాయాన్ని నిలిపి వేసేందుకు వారంతా ప్రయత్నించారు. అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం మీరు సాక్ష్యం చెప్పేందుకు హాజరు కాకపోయినట్టయితే అభిశంసన దర్యాప్తును అడ్డుకున్నట్టుగా దీనికి సాక్ష్యంగా పరిగణించాల్సి వస్తుందని అని అభిశంసన దర్యాప్తు కమిటీల చైర్మన్‌ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/