హాంగ్‌కాంగ్‌లో గొడుగులతో వేలాది మంది జనం

Hong Kong protests show
Hong Kong protests show

హాంకాంగ్ : వేలాది మంది ప్రజాస్వామిక వాదులు హాంగ్‌కాంగ్‌లో ఆదివారం భారీ ప్రదర్శనకు తరలివెళ్లారు. భారీ వర్షం నుంచి రక్షణగా గొడుగు లు ధరించి వారు మహానగరంలోని ప్రధాన వీధి మీదుగా మహా ప్రదర్శనకు దిగారు. చైనా ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ హాంగ్‌కాంగ్‌లో ఈ వేసవిలో వారాంతపు నిరసనలు సాధారణం అయ్యాయి. తొలుత వేలాది మంది ప్రదర్శకులు స్థానిక విక్టోరియా పార్క్ లో చేరారు. ఎంతకూ ఆగని వానను లెక్కచేయకుండా ఆ తరువాత ప్రదర్శనగా సాగారు. తామంతా శాంతియు త ప్రదర్శనగా వెళ్లుతామని, తమ హక్కులసాధనకు నినదిస్తామని నిర్వాహకులు తెలిపారు. నెలల తరబడి ఇక్కడ ఉద్య మం సాగుతోంది, తరచూ పోలీసులతో తలపడు తూ సాగిన ప్రదర్శనలు ఈ వారాంతంలో అందు కు విరుద్ధంగా అత్యంత ప్రశాంతతో క్రమశిక్షణ తో ముందుకు సాగింది. ఘర్షణాయుత వాతావరణం ఉండబోదనే తాము భావిస్తున్నట్లు ఉద్యమ నిర్వాహకులలో ఒకరైన బోనీ లియూంగ్ తెలిపా రు. ఇక్కడి వారు శాంతిప్రియలు అనే విషయం ప్రపంచానికి తెలిసివస్తుందని చెప్పారు. వేలాది గొడుగుల నీడలో జనం అంతా కెరటాలుగా తరలివెళ్లుతూ ఉండటంతో హాంగ్‌కాంగ్‌లో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. జూన్ నుంచి లియూంగ్ వర్గం వారు పౌర హక్కుల కూటమిగా ఏర్పడి ఇప్పటికీ మూడు బ్రహ్మండమైన ప్రదర్శనలు నిర్వహించారు.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/