ఇండోనేషియాలో భారీ భూకంపం!

జకార్తా: ఇండోనేషియా జావా ద్వీపంలో భూకంపం సంభవించింది. ఒక గంట వ్యవధిలోనే రెండు భూకంపాలు వచ్చాయి. మొదటి భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదయింది. గంటల వ్యవధిలో మరో భూకంపం అదే తీవ్రతతో సంభవించింది. ఇది బాలి ద్వీపాన్ని తాకిందని యూరోపియన్ మెడిటెరేనియన్ భూకంప కేంద్రం తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా ప్రాణ నష్టం సమాచారం లేదు. ఇండోనేషియాలో 260 మిలియన్ జనాభా ఉంది. ఆ దేశంలో భూకంపాలు సర్వసాధారణం. తరచూ భారీ అగ్నిపర్వతాలు విస్ఫోటం చెంది లావా పొంగిపొర్లి సమీప ప్రాంతాలను చుట్టుముట్టడం సాధారణంగా కనిపిస్తుంది. ఇండోనేషియా పసిఫిక్ తీరంలో ఉండటం వల్లే భూకంపాలు, అగ్నిపర్వతాలు విస్ఫోటనాలు జరుగుతుంటాయి. అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలుస్తారు. ఈ యేడాది మార్చిలో జావా ద్వీపంలో సంభవించిన భూకంపంలో నలుగురు మృతి చెందారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..https://www.vaartha.com/news/international-news/