ఆయనే విజిల్‌ బ్లోయర్‌గా మారి

White House

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు ఆధారాలున్నాయని ఒక రహస్య విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదు చేశారు. అయితే వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఇంతకీ ట్రంప్‌పై ఆరోపణలు చేసిన ఆ విజిల్‌ బ్లోవర్‌ ఎవరు? ఈ అంశంపై భద్రతా బృందాలు దర్యాప్తు చేయగా వారికి షాకింగ్‌ విషయాలు తెలిశాయి. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఓ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఎ) అధికారని వెల్లడైంది. ఆయనే విజిల్‌ బ్లోయర్‌గా మారి.. ట్రంప్‌ పై ఫిర్యాదు చేశాడని పేర్కొన్నాయి. ఆయన గతంలో వైట్‌హౌజ్‌లో సెక్యూరిటీ అధికారిగా పనిచేసినట్టు ధృవీకరించాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/