హఫీజ్‌ సయీద్‌ను విచారించాల్సిందే

పాక్‌ను హెచ్చరించిన అమెరికా

hafiz saeed
hafiz saeed

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ లష్కరేతోయిబా, జమాత్‌ ఉద్‌ దవా ఉగ్రసంస్థలకు చెందిన నలుగురు అగ్రనాయకులను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నారని పాక్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు ప్రొఫెసర్‌ జాఫర్‌ ఇక్బాల్‌, యాహ్యా అజీజ్‌, మొహ్మద్‌ ఆష్రాఫ్‌, అబ్దుల్‌ సలాంలను అరెస్టు చేశాయి. పాకిస్థాన్‌ చేపట్టిన ఈ అరెస్టులను అమెరికా స్వాగతించింది. వీరి అధినేతలను కూడా విచారణ చేయాలని అమెరికా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వంలో ఉన్నతాధికారిణి అలీస్‌ వెల్స్‌ ట్వీట్‌ చేశారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదులను అరెస్టు చేయడం తరువాత వదలడం పాక్‌కు కొత్తేమీ కాదని అమెరికా పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమైన తరువాత తమ భూభాగంపై ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన బాధ్యత పాకిస్థాన్‌ తీసుకోవాలని అమెరికా సూచించింది.

లష్కరేతోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదులు, వారి నాయకుడు హఫీజ్‌ సయీద్‌ను విచారణ చేయాలని డిమాండ్‌ చేసింది. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశానికి ముందు అమెరికా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థానఖ్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలా వద్దా అని అమెరికా ఆలోచిస్తున్నది. పాకిస్థాన్‌ ప్రస్తుతం ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ గ్రే లిస్టులో ఉంది. గతేడాది జూన్‌లో పాకిస్థాన్‌ను పారిస్‌ గ్రే లిస్టులో చేర్చింది. 2019 అక్టోబర్‌ నాటికి పాకిస్థాన్‌ తన వైఖరిని మార్చుకోకుంటే ఇప్పటికే బ్లాక్‌లిస్టులో ఉన్న ఇరాన్‌, ఉత్తరకొరియాల సరసన చేరుస్తామని పారిస్‌ హెచ్చరించింది. పాకిస్థాన్‌ పరిస్థితిని పారిస్‌ దగ్గరగా సమీక్షిస్తోంది. అయితే పాకిస్థాన్‌ ప్రస్తుతం ఉ్న గ్రే లిస్టు నుంచి బ్లాక్‌ లిస్టుకు వెళుతుందా లేక క్లీన్‌ చిట్‌తో బయట పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే హఫీజ్‌ సయీద్‌, మసూద్‌ అజార్‌లను పాకిస్థాన్‌ సీరియస్‌గా విచారణ చేయాలని అమెరికా గత నెలలో పాక్‌ను కోరింది. పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అమెరికా డిమాండ చేసింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/