అమెరికా వైట్‌హౌస్‌ వద్ద కాల్పులు

white house
white house


ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు

వాషింగ్టన్‌: అమెరికాలోని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌కు సమీపంలో ఒక వ్యకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా మరో అయిదుగురు గాయపడ్డారు. పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, కాల్పులకు కారణాలు తెలియరాలేదని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల నుండి వివరాలు సేకరిస్తున్నామని, అదేవిధంగా సిసిటివి పుటేజీలు పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు. కాల్పుల్లో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/