భారతీయ విద్యార్థిపై అమెరికాలో కాల్పులు!

gun shot
gun shot


వాషింగ్టన్‌: అమెరికాలో దుండగులు ఒక భారతీయ యువకుడిని కాల్చి చంపారు. పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల బల్జీత్‌సింగ్‌ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఖాళీ సమయంలో షికాగోలోని ఒక డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని గదికి బయలుదేరిన బల్జీత్‌ను దుండగులు కొందరు తుపాకులతో అడ్డగించారు. నగదు, సెల్‌ఫోన్‌ ఇవ్వాలన్నారు. తన వద్ద సెల్‌ఫోన్‌ లేదనడంతో దొంగులు అతనిపై కాల్పులు జరిపి అక్కడి నుండి పరారయ్యారు. బాధితుడి సమాచారంతో స్నేహితులు అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బల్జీత్‌ కన్నుమూసాడు. బల్జీత్‌ కుటుంబానికి సమాచారం అందించిన షికాగో పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/