ట్రంప్‌ను విమర్శించిన గ్రెటా థెన్‌ బర్గ్‌

Greta Thunberg
Greta Thunberg

అమెరికా: పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థెన్‌ బర్గ్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఆమె 16 ఏళ్ల వయసులోనే పాఠశాలకు సెలవు పెట్టి మరీ పర్యావరణ మార్పులపై ఉద్యమాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇటీవల ఆమె ఐరాసలో చేసిన ప్రసంగం పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వారిని ఆలోచింపజేసింది. కాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పర్యావరణం విషయంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే భూతాపం పెద్దగా అదుపులోకి రాకపోవచ్చునని అభిప్రాయపడింది. పర్యావరణ నేపథ్యంలో ట్రంప్‌ ప్రదర్శించే తీరు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని ఉద్యమానికి దారి తీసేలా చేసిందని తెలిపింది. వాతావరణ మార్పులపై ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కార్యాచరణను ప్రారంభించడం శుభ పరిణామమని గ్రెటా వ్యాఖ్యానించింది. కాగా ఆమె ప్రస్తుతం యూరప్‌ పర్యటనలో ఉంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/