ఇరాన్‌లో భారీ భూకంపం

అయిదుగురి మృతి

eartha quake
Earth quake

టెహ్రాన్‌: ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అజర్‌బైజాన్‌ పరిధిలోని తాబ్రిజ్‌ నగరానికి 120 కిలోమీటర్ల దూరంలో భూకంపం చోటు చేసుకుందని అధికారులు చెప్పారు. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 5.9గా నమోదైంది. భూకంపం కారణంగా అయిదుగురు మృత్యువాత పడ్డారని చెప్పారు. భూగర్భంలో 5 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వివరించారు. శుక్రవారం ఉదయం సంభవించిన ఈ భూకంపంతో ఇరాన్‌ వణికిపోయింది. భూకంపాన్ని ముందే అంచానవేసిన యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే దీనిపై హెచ్చరికలు జారీ చేసింది. కాగా, 2003లో ఇరాన్‌లో సంభవించిన భూకంపం అనేక మందిని బలితీసుకుంది. 1990లో సంభవించిన భూకంపం 40 వేల మందిని బలితీసుకుంది. ఈ విపత్తులతో ఇరాన్‌ తీవ్రంగా నష్టపోయింది. 2005, 2012లో సంభవించిన భూకంపాల్లో దాదాపు 900 మంది మృతి చెందారు. 2017లో సంభవించిన భూకంపం కారణంగా 600 మంది మృతి చెందారు. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. వరుస భూకంపాలతో ఇరాన్‌ అన్ని విధాలుగా నష్టనపోతున్నది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/