అమెరికాలో జాతి వివక్షపై పోరాటానికి గూగుల్ సాయం

37 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన సుందర్ పిచాయ్

sundar pichai
sundar pichai, google ceo

అమెరికా: అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతి వ్యక్తిని ఓ పోలీసు అధికారి మెడపై తొక్కిపెట్టడం, ఆపై ఆ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలో ప్రధాన నగరాలన్నీ ప్రదర్శనకారుల ఆందోళనలు, నిరసనలతో హోరెత్తుతున్నాయి. జాతి వివక్షకు అంతమెప్పుడు అంటూ వీధుల్లోకి వచ్చి నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అమెరికాలో జాతి వివక్షపై పోరాటానికి గూగుల్ మద్దతు తెలిపింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 37 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించారు.

జాతి అసమానతలపై పోరాటం సాగిస్తున్న సంస్థలకు 12 మిలియన్ డాలర్ల సాయం, జాతి వివక్షకు గురవుతున్న బాధితుల తరఫున పోరాడే సంస్థలకు 25 మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నట్టు పిచాయ్ వివరించారు. కాగా, అమరులైన నల్లజాతీయులను స్మరిస్తూ కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించాలని గూగుల్ పిలుపునిచ్చింది. ఈ మేరకు తమ ఉద్యోగులందరికీ ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/