అమెరికాలో సత్తాచాటిన ప్రవాస భారతీయులు

america
america

వాషింగ్టన్‌: అమెరికాలో జరిగిన రాష్ట్ర స్థాయితోపాటు, స్థానిక ఎన్నికల్లో నలుగురు ప్రవాస భారతీయులు వివిధ పదవులకు ఎన్నికయ్యారు. వీరిలో ఒక ముస్లిం మహిళ కూడా ఉన్నారు. వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌ సభ్యురాలిగా గజాలా హష్మీ విజయం సాధించారు. కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆమె డెమోక్రాటిక్‌ పార్టీ తరపున పోటీ చేశారు. ఆ రాష్ట్ర సెనేట్‌కు ఎన్నికయిన ప్రథమ ముస్లిం మహిళ ఆమే కావడం గమనార్హం. గజాలా కుటుంబం 50 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లి జార్జియాలో స్థిరపడింది. అప్పటికి ఆమె చాలా చిన్నది. ఆమె ప్రాథమిక విద్య, ఉన్నత విద్య అంతా అమెరికాలో సాగింది. మాజీ అధ్యక్షుడు ఒబామాకు సాంకేతిక సలహాదారుగా పనిచేసిన సుహాస్‌ సుబ్రహ్మణ్యం వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. శాన్‌ప్రాన్సిస్కో పబ్లిక్‌ డిఫెండర్‌గా మనో రాజు గెలుపొందారు. ఉత్తర కరోలినా రాష్ట్రంలోని ఛార్లెట్‌ సిటీ కౌన్సిల్‌కు డింపుల్‌ అజ్మీరా రెండో సారి ఎన్నికయ్యారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/