ఫ్రాన్స్ ప్ర‌ధాని ఎడువార్డ్ ఫిలిప్ రాజీనామా

అంగీక‌రించిన అధ్య‌క్ష భ‌వ‌నం

French prime minister Edouard Philippe resigns

ఫ్రాన్స్‌‌: ఫ్రాన్స్ ప్ర‌ధాని ఎడువార్డ్ ఫిలిప్ రాజీనామా చేశారు. అధ్య‌క్ష భ‌వ‌నం ఎలిసీ ప్యాలెస్ ఈ రాజీనామా విష‌యాన్ని ద్రువీక‌రించింది. అధ్య‌క్షుడు ఎమ్మాన్యువ‌ల్ మాక్ర‌న్‌కు రాజీనామా ప‌త్రాన్ని అంద‌జేశారు. ప్ర‌ధాని రాజీనామాను అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ప్ర‌భుత్వ స‌భ్యుల‌తో.. కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటు వ‌ర‌కు ప‌రిపాల‌న చేయ‌నున్న‌ట్లు అధ్య‌క్ష భ‌వ‌నం ఇవాళ‌ ఓ లేఖ‌లో పేర్కొన్న‌ది. 2017 నుంచి ఫిలిప్‌.. ఫ్రాన్స్ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. గ‌త వారం క్రితం జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో.. లీ హార్వే నుంచి ఫిలిప్ మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు. గ‌తంలోనూ ఇదే పోర్టు న‌గ‌రం నుంచి ఫిలిప్ మేయ‌ర్‌గా చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/