సంబరాల్లో అలుముకున్న విషాదం

FRANCE
FRANCE

సంబరాల్లో అలుముకున్న విషాదం

పారిస్‌: వరల్డ్‌ కప్‌ సాధించిన విజయంతో ఫ్రాన్స్‌ జట్టు అమితోత్సాహంతో ఊగిపోయింది. మరో పక్క చాలా మంది యువత కలత చెందారు. ఫ్రాన్స్‌ వరల్డ్‌ కప్‌ సాధించిన విజ యంతో పారిస్‌లోని ఎలీస్‌ అవెన్యూలో వందలు వేల సంఖ్యలో ఫుట్‌బాల్‌ క్రీడాభిమాను సంబరా లు చేసుకున్నారు. దాదాపు 30 మంది అభిమా నులు మాస్క్‌లు ధరించి మద్యం బాటిళ్లు, వైన్‌, షాంపైన్‌ బాటిళ్లను ఉప్పొంగించారు. సెల్‌ఫోన్లతో ఫొటోలు తీసుకున్నారు. కొంత మంది అక్కడున్న వస్తువ్ఞలను, కుర్చీలను, సీసాలను విసిరివేశారు. దాంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌ వదిలారు. ప్రేక్ష కులు చేస్తున్న విధ్వంసానికి ఫ్రెంచి జట్టు సభ్యుడు జెర్సీ సంబరం చేసుకోవడమంటే ఇదేనా అంటూ ఆవేదన చెందాడు.

వేల సంఖ్యలో ఉన్న వారంతా అక్కడి వెళ్లిపోయారు. ఇబ్బంది పెట్టేవారిపై పోలీసులు వాటర్‌క్యాన్‌ను ప్రయోగించారు. ఫ్రాన్స్‌లోని ఉత్తరాది పట్టణం లైయాన్‌లో ఎక్కడా లేని విధంగా అల్లర్లు చెలరేగాయని అధికారులు అన్నారు. ఓపెన్‌ ఏర్‌ స్టేడియంలో 100 మంది యువకులు పోలీసు వ్యాన్‌లపై ఎక్కారని, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు.

అక్కడున్న వారంతా చేతికి దొరికిన వస్తువ్ఞలను విసిరివేశారు. దాంతో తొక్కిసలాట జరిగింది. మెర్సిలీలో 10 మందిని అరెస్టు చేశారు. ఇద్దరు సెక్యూరిటీ దళాలు గాయపడ్డారని పోలీస్‌ అధికారి తెలిపారు. ఫ్రార్డ్‌ పట్టణాన తూర్పున ఉన్న నాన్సిలో సంబరాల్లో జరుగుతున్న చోట మోటర్‌ సైకిల్‌ తగలడంతో మూడేళ్ల బాలుడు, ఆరు సంవత్సరాలున్న ఇద్దరు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపరిచిన వాహనదారుడు అక్కడి నుండి పారిపోయాడని అధికారులు తెలిపారు. ఆగ్నేయ పట్టణం అన్నెసిలో ఆట చివరలో ఉండగా 50 ఏళ్ల వృద్ధుడు లోతులేని కాలువలోకి ఎగిరి పడి మెడ విరిగి చనిపోయాడు. దేశానికి రెండవసారి వచ్చిన వరల్డ్‌ కప్‌తో దేశమంతా సంబరాలు జరిగాయి. ఫ్రాన్స్‌లో జనం వీధుల్లోకి వచ్చి జెండాలు ఊపుతూ బాంబులు పేల్చారు. ఛాంప్స్‌ ఎలీసీస్‌ అవెన్యూలో 4వేల మంది మోహరించి వాహ నాలను నిషేధించారు. కప్‌ విజయోత్సవంలో దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది.

మరోపక్క విషాధ సంఘటనలు సైతం వెంటాడాయి. ఫ్రాన్స్‌లో 2015లో ఉగ్రవాదుల దాడులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన ప్రభుత్వం గత సంవత్సరం పోలీసులకు ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు అధికారాలు ఇచ్చింది.