ఫ్రాన్స్‌లోఆస్తుల స్తంభన

MASOOD
MASOOD


ఫ్రాన్స్‌ : కరడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్‌ టెర్రర్‌ గ్రూపు అధినేత మసూద్‌ అజర్‌ పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్రవేయించడంలో భారత్‌ ఐరాసలో విఫలమైనా, ఫ్రాన్స్‌ మాత్రం తనవంతుగా బయటి నుంచి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో మసూద్‌కు చెందిన ఆస్తులను స్తంభింప జేస్తున్నా మంటూ ఫ్రాన్స్‌అంతర్గత వ్వవహారాల మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖలు సంయక్తంగా ఓ ప్రకటన చేశాయి. ఫ్రాన్స్‌ ఆర్థిక,ద్రవ్య విధానం అను సరించి మసూద్‌ ఆస్తుల స్తంభనపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. అంతే కాకుండా,యూరోపియన్‌ అనుమానిత ఉగ్రవాదుల జాబితాలో మసూద్‌ అజర్‌ పేరు కూడా చేర్చేలా ఫ్రాన్స్‌ కృషి చేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.