కోవిడ్‌-19: జపాన్‌ నౌకలో నాలుగో వ్యక్తి మృతి

Daimond princess Cruise Ship
Daimond princess Cruise Ship

జపాన్‌: కోవిడ్‌ 19 వైరస్‌ కారణంగా జపాన్‌లోని డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో నాలుగో వ్యక్తి మృతి చెందాడు. సుమారు 14 రోజుల పాటు ఆ నౌక‌ను క్వారెంటైన్ చేసిన విష‌యం తెలిసిందే. జ‌పాన్‌లో మొత్తం 850 కోవిడ్‌19 కేసులు నమోదు అయ్యాయి. దాంట్లో క్రూయిజ్ షిప్‌కు చెందిన‌వారే 691 మంది ఉన్నారు. 3700 మంది ప్ర‌యాణికుల‌తో ఉన్న డైమండ్ ప్రిన్‌సెస్ నౌకను కరోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో క్వారెంటైన్ చేశారు. అయితే ఇటీవ‌ల ఆ నౌక‌లోని ప్ర‌యాణికులు విముక్తి అయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana