ఉగ్రవాదులు దాడి.. 14 మంది జవాన్లు మృతి

terrorist attack
terrorist attack

నైగర్‌: పశ్చిమ ఆఫ్రికాలో నైగర్ ప్రాంతంలో భద్రత బలగాల క్యాంప్‌పై ఉగ్రదాడులు మెరుపు దాడులు చేశారు. సనమ్‌లో భద్రతా బలగాలపై తీవ్రవాదులు అకస్మిక దాడులు చేయడంతో 14 మంది జవాన్లు మృతి చెందారు. జవాన్లు అప్రమత్తమై కాల్పులు జరపడంతో పది మంది తీవ్రవాదులు మృతి చెందినట్టు సమాచారం. బోకోహరమ్ తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు పోలీస్ అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 10న నైగర్‌లోని టిల్లబెరీ ప్రాంతంలో జరిగిన తీవ్రవాదుల దాడిలో 71 మంది సైనికులు అమరలైన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/