మోడిని ఆశ్రయం కోరిన ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ నేత

  • పాక్ లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణ
Baldev Kumar -Imran Khan
Baldev Kumar -Imran Khan

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ నుంచి గెలిచిన బల్దేవ్ కుమార్ భారత ఆశ్రయం కోరారు. పాకిస్థాన్‌లోని మైనార్టీలను, హిందువులు, సిక్కులను చంపేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన కుటుంబతో కలిసి పాకిస్థాన్ వదిలి భారత్ వచ్చేశారు. తన కుటుంబానికి ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సోరన్‌సింగ్ అనే వ్యక్తి హత్య కేసులో బల్దేవ్‌పై అరోణలున్నాయి. పోలీసులు ఆయనను తీవ్రంగా వేధించారు. అయితే, ఈ కేసులో బల్దేవ్‌పై చేసిన ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదలచేసింది. అనంతరం పాకిస్థాన్‌లో ఉండడం క్షేమం కాదని భావించిన బల్దేవ్ భార్య, పిల్లలతో కలిసి భారత్ చేరుకున్నారు. తనకు ఆశ్రయం కల్పించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/