ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసించిన విదేశీ మీడియా

vikram
vikram


న్యూఢిల్లీ: చంద్రుడి ఉపరితలంలోకి విక్రమ్‌ ల్యాండ్‌రోవర్‌ చేరుకునే కొన్ని సెకన్ల ముందు ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌.. తదితరులంతా ఇస్రో శాస్త్రవేత్తల పనితీరుపై ప్రశంసలు కురిపించారు. జాతి యావత్‌ ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలిచింది. ఒక్కదేశమే కాదు విదేశీ మీడియా కూడా ఇస్రో పనితీరును ప్రశంసించింది. చంద్రయాన్‌-2 మిషన్‌ కేవలం విక్రమ్‌ ల్యాండ్‌ రోవర్‌కు సంబంధించి సంబంధాలను మాత్రమే కోల్పోయింది. అన్నీ కాదు.. ప్రయోగం ఒక రకంగా సక్సెస్‌ సాధించినట్లేనని అమెరికాకు చెందిన మ్యాగజైన్‌ వైర్‌ పేర్కొంది. ముందుగా అంచనావేసిన ప్రకారం విక్రమ్‌ ల్యాండ్‌ రొవర్‌ వెళ్లినా ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయని గుర్తు చేసింది.

ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌ -2 అనేది పెద్ద కార్యక్రమమని కానీ సంబంధాలు తెగిపోవడం అనేక సాంకేతిక లోపమని పేర్కొంది. ఇస్రో దశాబ్దాల చరిత్రలో ఇదో మైలురాయి అని న్యూయార్క్‌ టైమ్స్‌ కొనియాడింది. ప్రపంచ యవనికపై ఇండియాను నిలబెట్టేందుకు శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని పేర్కొంది. న్యూయార్క్‌టైమ్స్‌ మాదిరిగానే ఫ్రెంచ్‌ డైలీ కూడా స్పందించింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండ్‌ రోవర్‌ లాంచ్‌ అయింది. కానీ సిగ్నల్స్‌అందకపోవడం అనేది దురదృష్టకరమని అభిప్రాయపడింది. దీంతో మిషన్‌ 45 శాతం విజయం సాధించిందని తెలిపింది. మరో వందేళ్లలో చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసుకోవడం ఖాయమని బ్రిటిష్‌ పత్రిక గార్డియన్‌ పేర్కొంది. ఇందుకోసం భారత్‌ ముందడుగు వేసిందని అభిప్రాయపడింది. అయితే వాషింగ్టన్‌ పోస్ట్‌ రియాక్షన్‌ మాత్రం మరోలా ఉంది. చంద్రయాన్‌ -2 ప్రయోగంతో భవిష్యత్‌లో చేపట్టి అంతరిక్ష ప్రయోగాలపై ప్రభావం చూపుతుందన్నది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/