విమానాన్ని దించిన కాఫీ!

flight
flight


లండన్‌: ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తప్ప విమానాన్ని మధ్యలో దించరు. అయితే జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి మెక్సికోలోని కాన్కున్‌కు బయలుదేరిన ఎయిర్‌బస్‌ ఎ330-243 విమానంలో మార్గ మధ్యలో పైలట్‌ కాఫీ తాగుతూ కప్పును తన ముందున్న టేబుల్‌పై పెట్టాడు. అది కాస్త కిందపడింది. వేడిగా ఉన్న కాఫీ కాక్‌పిట్‌లోని సర్క్యూట్‌లపై పడింది. వెంటనే కాలిన వాసన, పొగ వచ్చాయి. ఇది గుర్తించిన పైలట్లు ప్రమాదమేదో జరిగిందని అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఆ సమయంలో సమీపంలో ఉన్న ఐర్లాండ్‌లోని శాసన్‌ ఎయిర్‌పోర్టులో విమానాన్ని దించారు. అయితే ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగింది. పొగ ఎందుకు వచ్చిందో అప్పడు తెలియలేదు. అయితే దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు పొగ రావడానికి కారణం కాఫీ పడటమేనని వెల్లడించారు. పైలట్‌ అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందన్నారు. ప్రత్యేక కప్‌ హోల్డర్లు ఉన్నా టుబుల్‌ పెట్టడం వల్లే కాఫీ ఒలికి ఇంత జరిగిందని వెల్లడయింది. పైలట్‌ చేసిన చిన్న పొరపాటు 326 మంది ప్రయాణికులున్న విమానం అత్యవసర ల్యాండింగ్‌కు కారణమైంది. ఇది ఫిబ్రవరిలో జరిగినా నివేదిక మాత్రం ఇప్పుడు విడుదలయింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/international-news/