ఆస్ట్రేలియాలో పిడుగు పడి చెలరేగిన మంటలు

విక్టోరియా: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో బన్‌యిప్‌ జాతీయ పార్కులో శుక్రవారం పిడుగు పడి మంటలు చెలరేగాయి. రాష్ట్రంలో చెలరేగిన మంటలు అడవులను దహించి వేస్తున్నాయి. పార్కు సహా తూర్పు ప్రాంతంలోని అడవులు కార్చిచ్చు ధాటికి బూడిదగా మారుతున్నాయి. మంటలను అదుపు చేయడానికి దాదాపు 300 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది శ్రమిస్తున్నారు. అగ్నికి గాలి తోడవడంతో మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారింది. బలమైన గాలుల కారణంగా మంటలు వేర్వేరు దిశలకు మరింతగా విస్తరిస్తున్నాయి. మంటలను నియంత్రించేందుకు హెలికాఫ్టర్ల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.