యుఎస్ రాయబార కార్యాలయం పై మళ్లీ రాకెట్‌ దాడులు

యూఎస్ ఎంబసీ ప్రహరీగోడ సమీపంలో పడ్డ ఐదు రాకెట్లు

rockets-hit
rockets-hit

బగ్దాద్‌: ఇరాక్ మరోసారి అట్టుడికింది. రాజధాని బాగ్దాద్ లోని హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న యూఎస్ ఎంబసీ లక్ష్యంగా ఆదివారం రాత్రి రాకెట్ దాడులు జరిగాయి. ఈ రాకెట్ దాడుల విషయాన్ని పలు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు వెల్లడించాయి. అమెరికా రాయబార కార్యాలయం ప్రహరీ గోడకు సమీపంలోనే ఐదు రాకెట్లు పడ్డాయని తెలుస్తుండగా, దీనిపై అమెరికా గానీ, ఇరాక్ గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇటీవల ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీమ్ సులేమానీని అమెరికా సైన్యం హతమార్చిన అనంతరం మొదలైన ప్రతీకార దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో ఎవరీకి గాయాలు కాలేదని ఇరాక్‌ భద్రతా బలగాలు, ఇటు అమెరికా వర్గాలు ప్రకటించాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/