సంక్షోభంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌

thomson airways
thomson airwaysలండన్‌: వందేళ్లనాటి బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. సంస్థలో నిధులు లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు చెందిన 6 లక్షల టికెట్లను రద్దు చేసుకుంది. 178 ఏళ్ల చరిత్ర కలిగి ప్రముఖ బ్రిటిష్‌ టూర్‌ కంపెనీ థామస్‌ కుక్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ నిధులు లేకపోవడంతో బుక్‌ చేసుకున్న టికెట్లను కూడా రద్దు చేసుకుంది. విదేశాల్లో ఉన్న బ్రిటన్‌ కస్టమర్లు తిరిగి ఆ దేశానికి చేరుకునేందుకు థామస్‌ కుక్‌ ఎయిర్‌వేస్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నారు. వీరి టికెట్లన్నీ రద్దు కావడంతో ఆయా దేశాల్లో నిలిచిపోయిన కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. బ్రిటిన్‌ తిరిగి రావాల్సిన వారు ఒక యాభై వేల మంది ఉన్నారు. వీరందరినీ దేశానికి తీసుకురావాల్సిన బాధ్యత బ్రిటన్‌ ప్రభుత్వంపై పడింది. థామస్‌ కుక్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ విమానాలను నిలిపివేయడంతో ఈ సంస్థకు 16 దేశాల్లో పనిచేస్తున్న 21 వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇందులో యూకేకు చెందినవారే 9 వేల మంది ఉన్నారు. బ్రెగ్జిట్‌తో నెలకొన్న పరిస్థితులే తమ సంస్థను సంక్షోభంలోకి నెట్టాయని థామ
్‌ కుక్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యం గతంలో ఆరోపించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న థామస్‌ కుక్‌ పర్యాటక సంస్థ నష్టాల నుంచి గట్టెక్కాలంటే 200 మిలియన్‌ పౌండ్లు అవసరమవుతాయని వెల్లడించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/