డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు కు షాక్‌

trump
trump

వాషింగ్టన్‌: ఇమిగ్రెంట్లకు సంబంధించిన ఆరోగ్యబీమా అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు నిర్దేశించిన నిబంధన అమలును ఫెడరల్‌ కోర్టు ఒకటి నిలిపేసింది. వీసాల మంజూరు కంటే ముందే ఇమిగ్రెంట్లు ఆరోగ్యబీమాను పొందాలని, లేదంటే వైద్య సంరక్షణ కోసం నిర్దేశిత మొత్తాన్ని చెల్లించగలమని రుజువు చూపాలని ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన అమల్లోకి రాకుండా డిస్ట్రిక్ట్‌ జడ్జి మైఖెల్‌ సైమన్‌ నిలిపేశారు. చట్టబద్ధంగా ఇమిగ్రేషన్‌ పొందే వీలున్న మూడింట రెండు వంతుల మంది అవకాశాలను ఈ నిబంధను దెబ్బతీస్తుందంటూ కొందరు అమెరికా పౌరులు, ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేశారు. దీనిపై స్పందించిన జడ్జి నిబంధనల అమలును నిలిపేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/